గుంటూరు జనరల్ ఆస్పత్రికి ఎన్ఆర్ఐలు మూడు వెంటిలేటర్లు విరాళంగా అందాయి. యూఎస్ఏ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ డల్లాస్ చాప్టర్, ఐఐటీ ఎన్టీ పూర్వ విద్యార్థులు, కొల్లూరు ప్రసాద్ సంయుక్తంగా.. ఈ పరికరాలను అందచేశారు. డాక్టర్ నన్నపనేని మురళి, ఫార్మా పారిశ్రామిక వేత్త రత్నరెడ్డి చేతుల మీదుగా వెంటిలేటర్స్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ప్రభావతి అందుకున్నారు.
దానం గొప్ప విషయం..
కొల్లూరు ప్రసాద్‌తో పాటు ప్రవాస భారతీయులు పెద్ద మనస్సుతో ఆస్పత్రికి వెంటిలేటర్స్ ఇవ్వడం సంతోషం కలిగించిందని డా. ప్రభావతి పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణవాయువు అందించే పరికరాలను దానం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రవాస భారతీయులు రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలలకు సుమారు 100 వెంటిలేటర్స్‌ను అందిస్తున్నారని డాక్టర్ నన్నపనేని మురళి, రత్నారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జీజీహెచ్‌కు మూడు వెంటిలేటర్లు అందచేసినట్లు దాతలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: