ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ పంటలకు సంబంధించి కొత్తగా 12 వంగడాలను అభివృద్ధి చేసినట్లు… వీసీ ఆదాల విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. విశ్వవిద్యాలయాన్ని పరిశోధన విస్తరణ, బోధన పరంగా మరింత ముందుకు తీసుకువెళ్తామని వివరించారు. దేశవ్యాప్తంగా 42 మిలియన్ల ఎకరాల్లో వరి విస్తీర్ణం సాగవుతుండగా… అందులో మూడో వంతు వంగడాలు ఆంగ్రూ నుంచి వచ్చినవేనని స్పష్టం చేశారు. వేరుశనగకు సంబంధించి కదిరి, తిరుపతి నుంచి అభివృద్ధి చేసిన వంగడాలు దేశంలో 54 శాతం సాగుచేస్తున్నారని వివరించారు. వ్యవసాయానికి మరింత సాంకేతికత జోడించి మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు కృషి చేస్తామని వీసీ వివరించారు.
ఇదీ చదవండి: