అమరావతి రైతులు
కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా రాజధాని ప్రాంతంలో జై అమరావతి నినాదం ప్రతిధ్వనించింది. దీక్షా శిబిరాల వద్దే రైతులు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. రంగవల్లులపై సేవ్ అమరావతి అంటూ గీశారు. కొత్త ఏడాదిలోనైనా పాలకుల మనసు మార్చి అమరావతిని రాజధానిగా కొనసాగించేలా చూడాలని ప్రార్థించారు. దీక్షా శిబిరాల వద్ద కేక్ కట్ చేసి ఆంగ్ల సంవత్సరాదిని స్వాగతించారు.
తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన 20 మంది రైతులు మహారాష్ట్రలో ఉన్న షిర్దీ సాయి ఆలయానికి వెళ్లారు. అమరావతి రాజధానిగా కొనసాగాలని మొక్కుకున్నారు. అనంతరం ఆలయంలో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
గుంటూరు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కార్యాలయంలో ఆంగ్ల నూతన సంవత్సరం వేడుకలు జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. అనంతరం నియోజవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలందరకీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో అన్నీ శుభాలే జరగాలని మనసారా ఆ దేవున్ని ప్రార్థిస్తున్నానన్నారు.
ఇదీ చూడండి. 2020లో చివరి సూర్యోదయ , సూర్యాస్తమయాలు