గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి కొండ చుట్టూ.. నూతన రహదారి పనులు త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ మార్గానికి గాలి గోపురాన్ని నిర్మించిన రాజా వాసిరెడ్డి పేరును పెట్టనున్నారు. ఏకో పార్కు, నడక మార్గానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. పార్క్ ఆకృతులు, రహదారి మార్గం పనులపై అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ పనులు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: