సుబాబుల్ రైతులకు ప్రభుత్వం ప్రటించిన మద్దతు ధర దక్కేలా చేయాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రమణ్యం... నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను కలిసి విజ్ఞప్తి చేశారు. టన్ను సుబాబుల్ను వ్యాపారులు రెండు వేలకే కొనుగోలు చేస్తున్నారనీ.. కూలీలు చెల్లించగా రైతుకు టన్నుకు 1300 మాత్రమే మిగులుతోందని ఎంపీకి వివరించారు. మద్దతు ధర టన్నుకి 4,400 ఉన్నప్పటికీ.. వ్యాపారులు సగం ధరకే కొనుగోలు చేయటం వలన రైతులకు తీవ్ర నష్టం వస్తోందని తెలిపారు. వెంటనే స్పందించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు.. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్తో చర్చించారు. పేపర్ మిల్లు యాజమాన్యంతో మాట్లాడి సుబాబుల్ రైతులకు మద్దతు ధర చెల్లించేలా చూడాలని కోరారు.
ఇదీ చదవండి: హారన్ కొట్టినందుకు ఆయువు తీయబోయాడు!