ETV Bharat / state

సెప్టెంబర్ 11న జాతీయ లోక్ అదాలత్​ల నిర్వహణ

author img

By

Published : Aug 18, 2021, 5:22 PM IST

జాతీయ లోక్ అదాలత్​లను సెప్టెంబర్ 11న నిర్వహించనున్నట్లు గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ రత్నకుమార్ చెప్పారు. సెప్టెంబరు 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లాలో 20 నుంచి 25 వరకు ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

జాతీయ లోక్ అదాలత్
జాతీయ లోక్ అదాలత్

సెప్టెంబర్ 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ రత్నకుమార్ చెప్పారు.

జూలై 10న గుంటూరు జిల్లాలో నిర్వహించిన లోక్ అదాలత్ లో 2వేల 226 పెండింగ్ కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు. సెప్టెంబరు 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ప్రతి కోర్టులో ప్రత్యేకబెంచి ఏర్పాటు చేస్తామని.. జిల్లాలో 20 నుంచి 25 వరకు ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

సివిల్ కేసులతోపాటు పరిష్కరించుకునే వీలున్న క్రిమినల్ కేసులను సైతం జాతీయ లోక్ అదాలత్ లో కక్షిదారులు పరిష్కరించుకోవాలని రత్నకుమార్ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: 'సుప్రీం న్యాయమూర్తుల నియామకంపై వార్తలు బాధాకరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.