ETV Bharat / state

ఈ నెల 18 నుంచి నరసరావుపేటలో సంపూర్ణ లాక్​డౌన్​ - గుంటూరు జిల్లా తాజా కరోనా వార్తలు

ఈ నెల 18 నుంచి నరసరావుపేటలో సంపూర్ణ లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ఆర్డీవో మొగలి వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కలెక్టర్​ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

narasaraopeta lockdown from saturday onwards says rdo mogali venkateswarlu
ఆర్డీవో మొగలి వెంకటేశ్వర్లు
author img

By

Published : Jul 16, 2020, 8:15 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఈ నెల 18వ నుంచి సంపూర్ణ లాక్ డౌన్ విధించనున్నట్లు ఆర్డీవో మొగిలి వెంకటేశ్వర్లు ప్రకటించారు. పట్టణంలో గత 10 రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆదేశాల మేరకు సంపూర్ణ లాక్​డౌన్ విధిస్తున్నట్లు ఆయన తెలిపారు.

గురు, శుక్రవారాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు నిత్యావసర సరకులు కొనుగోలు చేయాలని సూచించారు. శనివారం నుంచి పట్టణంలో సంపూర్ణ లాక్​డౌన్​ నిర్వహిస్తామని పేర్కొన్నారు. మందులు, పాల దుకాణాలకు తప్ప మిగతా అన్ని షాపుల్లో క్రయవిక్రయాలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఉన్నతాధికారుల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు లాక్​డౌన్​ కొనసాగుతుందని ఆర్డీవో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

కోనసీమలో కరోనా మహమ్మారి... ఇప్పటివరకు 410 కేసులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.