రాష్ట్ర ప్రజలు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటుంటే... జగన్కు చీమకుట్టినట్లుగానూ లేదని అమరావతి జేఏసీ నాయకులు మండిపడ్డారు. నరసరావుపేటలో అమరావతికి మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. రాజధానికి సంబంధించి అన్ని వనరులను గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని.. వాటిని అభివృద్ధి చేయకుండా మూడు రాజధానులతో అదనపు ఖర్చు దేనికని జేఏసీ నాయకుడు కాసా రాంబాబు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ, విద్యార్థి సంఘం నాయకులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: