గుంటూరు జిల్లా అరండల్‌పేటలో వైకాపా బాధితుల పునరావావాస కేంద్రానికి వెళ్లి పరామర్శించారు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. తెదేపాకు ఓటేసిన ప్రతి ఒక్కరినీ ఇబ్బందులు పెడుతున్నారనీ... వంద రోజులు సహనంగా ఓపిక పట్టినా ఇక సహించేది లేదంటూ హెచ్చరించారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో కార్యకర్తలను చంపేసినట్లే, ఇప్పుడు జగన్ ఏడుగురు తెదేపా కార్యకర్తలు చంపేశారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచి, ఒక్కో కుటుంబానికి పది వేల ఆర్థిక సాయం, పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. వైకాపా నేతలు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనీ, బాధితులకు రక్షణ కల్పించకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: