గుంటూరు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభలు కట్టవద్దని పోలీసులు హెచ్చరించడం విచారకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. దశాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని అడ్డుకోవడం శోచనీయమని తెలిపారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ... ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలే గాని, ఆంక్షలు విధించి భక్తుల మనోభావాలను కించపరచవద్దని సూచించారు. పవిత్రమైన తిరుమల లడ్డూలను ఓటర్లకు పంచి సాంప్రదాయాన్ని కాలరాశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.