Lokesh built seven roads his own expense: మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలోని పోల్కంపాడు దేవునిమాన్యం ప్రాంతంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన సొంత ఖర్చులతో యుద్ధ ప్రాతిపదికన ఏడు రోడ్లు వేయించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తన తీరు ప్రత్యేకమని మరోసారి చాటారు. ఈ నెల 15వ తేదీన మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవుని మాన్యం ప్రాంత ప్రజలు తమ రోడ్ల దుస్థితిని లోకేశ్‌కు చూపించారు. జంగిల్ క్లియరెన్స్ చేయించి, గుంతలు పూడ్చిన తరువాత.. చిప్స్‌తో ఏడు రోడ్లను సిద్ధం చేయించారు. రాత్రి తమ రోడ్ల ఇబ్బందులు తెలుసుకుని.. 24 గంటల్లోనే ఇళ్లకు వెళ్లేందుకు సాఫీగా రోడ్లను వేయించిన లోకేశ్‌కు స్థానికులు కృతజ్ఞతలు చెప్పారు.
ఇవీ చదవండి: