రాష్ట్రంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక జగన్ కుట్రలు పన్నుతున్నారని మంత్రి నక్కా ఆనందబాబు గుంటూరులో మండిపడ్డారు. డేటా చోరీ విషయంలో ప్రతిపక్ష నేత అనైతిక చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ పోలీసులకు.. అక్రమాలకు పాల్పడేవారిపై కేసులు పెట్టే ధైర్యంలేకఐటీ సంస్థపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో జగన్కుప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు,
ఇవీ చదవండి...