ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా నాగుల చవితి పూజలు.. - జంతుపూజ

Nagula Chavithi: సమస్త ప్రాణకోటిని పూజించే పుణ్యభూమి మనది. అందులో.. నాగుల చవితి పండుగ ..ప్రత్యేకంగా నిలుస్తుంది. నాగుల చవితి సందర్భంగా భక్తులు నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు, పుట్టల వద్ద ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు.

Nagula Chavithi
నాగుల చవితి
author img

By

Published : Oct 29, 2022, 12:42 PM IST

Nagula Chavithi: రాష్ట్ర వ్యాప్తంగా నాగులచవితి పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పుట్టలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆయా ప్రాంతాలకు భక్తులు పోటెత్తారు. పుట్టలో పాలు పోసి పూజలు చేశారు. బాపట్ల జిల్లాలోని బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు ప్రాంతాల్లోని పుట్టల వద్ద భక్తులు నాగేంద్రస్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

కేంద్రపాలిత యానంలోనూ నాగుల చవితి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. కోనసీమ జిల్లాలోని తాళరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో నాగులచవితిని వైభవంగా జరుపుకున్నారు. కోనసీమ వ్యాప్తంగా నాగుల చవితి పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు నాగేంద్రుని కొలుస్తూ పూజలు చేశారు. ప్రకాశం జిల్లాలోనూ యర్రగొండపాలెంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

విజయనగరం జిల్లా వ్యాప్తంగా నాగుల చవితి పూజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో తెల్లవారుజాము నుంచే పుట్టల వద్దకు చేరుకుని నాగులచవితి పూజలు చేస్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట స్వర్ణముఖి నది ఒడ్డున పుట్ట వద్ద నాగులచవితితో భక్తులు భారీగా తరలివచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి పుట్ల వద్దకు చేరుకుని పాలు గుడ్లు వేసి మొక్కలు తీర్చుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నాగుల చవితి పూజలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.