విజయవాడలో యువతిని చంపి.. తనను తాను గాయపర్చుకున్న నాగేంద్రబాబు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. అతడిని డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. పదమూడు రోజుల చికిత్స అనంతరం నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై తాజాగా వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు. శస్త్రచికిత్స చేసిన అవయవాల పని తీరును తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు.
వైద్య పరీక్షల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.మీడియాతో మాట్లాడడానికి నాగేంద్రబాబు నిరాకరించాడు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు. శస్త్ర చికిత్స జరిగిన లోపలి భాగాలు ఇంకా పూర్తిగా నయం కాలేదన్నారు. మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే నాగేంద్రబాబును డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: