ETV Bharat / state

నాగార్జున సాగర్ కుడి కాలువ మరింత పటిష్ఠం! - నాగార్జున సాగర్ కుడి కాలువ మరింత పటిష్ఠం

నాగార్జున సాగర్‌ కుడి కాలువకు గండ్లు పడటం.. యంత్రాంగం అప్పటికప్పుడు ఇసుక బస్తాలతో వాటిని పూడ్చడం.. ఏటా పరిపాటిగా మారింది. లీకేజీలతో నీటి నష్టం ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో కుడి కాలువను పటిష్ఠం చేయాలని జల వనరులశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. దీంతో నిధుల ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.

Nagarjuna Sagar
Nagarjuna Sagar
author img

By

Published : Jun 19, 2020, 8:41 AM IST

సాగర్‌ కుడికాలువ మొదటి మైలు నుంచి బుగ్గవాగు రిజర్వాయర్‌ వరకు ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు రూ.200 కోట్ల నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నాగార్జున సాగర్‌ జలాశయం నుంచి బుగ్గవాగు వరకు 27 కిలోమీటర్ల పరిధిలో కుడి కాలువ నుంచి 1200 క్యూసెక్కుల నీరు వృథాగా పోతోందని అధికారులు గుర్తించారు.

ప్రపంచబ్యాంకు నిధులతో 10 కిలోమీటర్ల మేర కాలువ లైనింగ్‌ చేశారు. ఇంకా 17 కిలోమీటర్ల మేర కాలువ ఆధునికీకరించాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితే బుగ్గవాగు వరకు ఆటంకాలు లేకుండా కాలువలో నీటిని సరఫరా చేయవచ్ఛు గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో 11 లక్షల ఎకరాలకు సాగునీరు సరఫరాలో ఇబ్బందులు తొలగుతాయి. ప్రస్తుతం నీటి సరఫరాలో సమస్యలతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ప్రభుత్వ విప్‌, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జలవనరులశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పనులు ప్రారంభమయ్యేలా చూస్తామన్నారు.

ఇదీ చదవండి: విజృంభిస్తున్న కరోనా..రాష్ట్రంలో 10 రోజుల్లో భారీగా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.