వ్యవసాయ రంగంలో సేంద్రీయ సాగు వంటి సహజ విధానాల వైపు రైతులు అడుగులు వేయాలని.. నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు పిలుపునిచ్చారు. భూసారాన్ని పర్యవేక్షించి, పంటల ఉత్పాదకత పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రులు కురసాల కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, ఎమ్మెల్యే నంబూరు శంకర్‌రావుతో కలిసి గుంటూరు జిల్లా అమరావతి మండలం అత్తలూరులో గోవిందరాజులు పర్యటించారు.
అక్కడ సాగవుతున్న సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన చింతల గోవిందరాజులు... సేంద్రీయ విధానంలో సాగు చేసే రైతులకు నాబార్డు తరఫున అవార్డులు ఇస్తామని తెలిపారు. సేంద్రీయ వ్యవసాయాన్ని విజయవంతంగా నడిపిస్తున్న రైతులను అభినందించిన మంత్రి పెద్దిరెడ్డి.. ప్రభుత్వపరంగా సహాయం అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబును కోరారు. రైతు పక్షపాతిగా జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
ఇదీచదవండి.