గుంటూరులో పౌరసరఫరాల శాఖ కార్మికులు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరంలోని ఎంఎల్ఎస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. జనవరి ఒకటి నుంచి కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లుగా పీఎఫ్ కడుతున్న కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: