రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ముస్లింలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు ర్యాలీ చేశారు. ఈ నిరసనకు వామపక్షాలు, జనసేన నాయకులు మద్దతు తెలిపారు. కంభం మండలంలో ఎన్ఆర్సీ ,సీఏఏ చట్టాన్ని రద్దు చేయాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ముస్లింలు భారీ ప్రదర్శన నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కులాలకు చెందిన మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చూడండి: