అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. గుంటూరు సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు రూ.20 వేలలోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు వైకాపా ప్రభుత్వం 3 నెలల్లో నగదు చెల్లిస్తామని చెప్పినప్పటికి... సంవత్సరం గడిచినా బాధితులకు నగదు అందజేయలేదని అన్నారు. తక్షణమే అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసి నవంబర్, డిసెంబర్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని తెలిపారు. అగిగోల్డ్ బాధితుల సమస్యల పై చర్చించడానికి ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో ఈ నెల 17వ తేదీన మంగళగిరి అంబేద్కర్ విగ్రహం నుంచి "ఛలో అసెంబ్లీ విజ్ఞాపన పాదయాత్ర " కార్యక్రమానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు.
'ముఖ్యమంత్రిని కలవడానికి అనుమతివ్వాలి' - muppala nageshwar rao latest news
అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పై చర్చించడానికి ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతివ్వాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. లేని పక్షంలో ఈ నెల 17 న ఛలో అసెంబ్లీ విజ్ఞాపన పాదయాత్ర చేపడతామని తెలిపారు.
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. గుంటూరు సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు రూ.20 వేలలోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు వైకాపా ప్రభుత్వం 3 నెలల్లో నగదు చెల్లిస్తామని చెప్పినప్పటికి... సంవత్సరం గడిచినా బాధితులకు నగదు అందజేయలేదని అన్నారు. తక్షణమే అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసి నవంబర్, డిసెంబర్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని తెలిపారు. అగిగోల్డ్ బాధితుల సమస్యల పై చర్చించడానికి ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో ఈ నెల 17వ తేదీన మంగళగిరి అంబేద్కర్ విగ్రహం నుంచి "ఛలో అసెంబ్లీ విజ్ఞాపన పాదయాత్ర " కార్యక్రమానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: లారీ డ్రైవర్ అతివేగానికి యువకుడి ప్రాణం బలి