ETV Bharat / state

మంగళగిరిలో తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఆఫీస్ కూల్చివేత - మంగళగిరిలోని తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఆఫీస్ కూల్చివేత తాజా అప్ డేట్స్

మంగళగిరిలో అక్రమ నిర్మాణాల పేరుతో... మిద్దె సెంటర్‌లోని తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ చర్యపై తెదేపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

demolish telugunadu trade union office
తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఆఫీస్ కూల్చివేత
author img

By

Published : May 27, 2021, 12:24 PM IST

తెలుగుదేశం పార్టీ నేతలు మహానాడు సందడిలో ఉండగా మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంగళగిరిలోని తెలుగునాడు చేనేత కార్మిక సంఘ భవనాన్ని కూల్చేశారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో భవనాన్ని నిర్మించారంటూ నగర పాలక సంస్థ సిబ్బంది ప్రొక్లెయిన్ల​తో భవనాన్ని నేలమట్టం చేశారు.

సమాచారం తెలుసుకున్న తెదేపా నేతలు సంఘటనా స్థలానికి వచ్చేసరికే భవనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యకు ప్రతి అధికారి రాబోయే కాలంలో సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. న్యాయపోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు చెప్పారు. మరోవైపు.. అధికారులు మాత్రం భవనం కూల్చివేతపై గతంలోనే నోటీసులు ఇచ్చినట్లు స్పష్టం చేస్తున్నారు.

ఇవీ చూడండి:

కొత్త జిల్లాల ఏర్పాటుకు.. ముందే అనుమతి తీసుకోవాలి: కేంద్రం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.