ETV Bharat / state

ముంచుకొస్తున్న గడువు... గుంటూరు జిల్లాలో ప్రచార హోరు

నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర పడుతుండంతో అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అభ్యర్థులతో పాటు పార్టీ నేతలూ పాల్గొన్నారు. ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే పట్టణాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు.

municipal election campaigning in guntur district
ముంచుకొస్తున్న గడువు... గుంటూరు జిల్లాలో జోరుగా ప్రచారం
author img

By

Published : Mar 8, 2021, 5:02 PM IST

మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు అధికమవుతున్నాయతని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరు నగరంలోని 32వ డివిజన్​లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపా ఓడిపోతుందన్న భయంతో ఆ పార్టీ నేతలు ప్రత్యర్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వైకాపా నేతలు ఎన్ని కుట్ర రాజకీయాలు చేసినా ఓటమి తప్పదని పేర్కొన్నారు.

వినుకొండలో...

వినుకొండ పట్టణంలోని వైకాపా కౌన్సిలర్ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ... వైకాపా ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, యువ నాయకుడు బోల్లా గిరిబాబు, ఛైర్మన్ అభ్యర్థి డాక్టర్ దస్తగిరితో పాటు పలువురు పాల్గొన్నారు.

చిలకలూరిపేటలో...

వైకాపా ప్రభుత్వ అరాచకాలను అరికట్టాలంటే తెదేపాకు ఓటేయాలని చిలకలూరిపేట మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. మరోవైపు సీఎం జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని ఎమ్మెల్యే విడదల రజిని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీచదవండి.

చంద్రబాబు రోడ్ షో వద్ద స్వల్ప ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.