గుంటూరులో తాజాగా కరోనా కేసులు నమోదైనా.. గోరంట్ల, సీతానగర్ తదితర ప్రాంతాల్లో నగర మున్సిపల్ కమిషనర్ చల్లా అనురాధ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లు, పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కంటైన్మెంట్ ప్రాంతాలలో ప్రజలు రాకపోకలను సాగించకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు లేకుండా వారికి అవసరమైన నిత్యావసర సరుకులు, పాలు , కూరగాయల బండ్లు ఆయా ప్రాంతాల్లో తిరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావకాన్ని, బ్లీచింగ్, లిక్విడ్ క్లోరిన్లను పిచికారీ చేయించాలని ఆమె తెలిపారు. పర్యటనలో కమిషనర్‌తో పాటు ఇంజనీరింగ్ అధికారులు, ప్రజారోగ్య అధికారులు, సెక్రటరీ, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
రెడ్‌జోన్‌లో మున్సిపల్ కమిషనర్ పర్యటన - karona latest news guntur
గుంటూరులో కరోనా సోకిన ప్రాంతాలలో డిస్ఇన్ఫెక్షన్ పనులు, పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా నిర్వహించాలని నగర మున్సిపల్ కమిషనర్ చల్లా అనురాధ ఆధికారులను ఆదేశించారు. ఆశ వర్కర్లు, వాలంటీర్లు డోర్ టు డోర్ తిరిగి సర్వే నిర్వహిచాలని, ఎవరైనా అస్వస్థతకు గురైనట్లు గుర్తిస్తే... వెంటనే అధికారులకు తెలియపరచి, పరీక్షలను నిర్వహించాలని ఆమె సూచించారు.
![రెడ్‌జోన్‌లో మున్సిపల్ కమిషనర్ పర్యటన Municipal Commissioner visited the Red Zone guntur city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7434390-305-7434390-1591019362739.jpg?imwidth=3840)