ETV Bharat / state

మాతాశిశు కేంద్రాన్ని కూల్చివేసిన ఆర్​అండ్​బీ అధికారులు - mother child welfare center demolition in chebrolu

గుంటూరు జిల్లా చేబ్రోలులోని మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని.. అక్రమ నిర్మాణమంటూ అధికారులు కూల్చివేశారు. దాదాపు ఐదు లక్షలు వెచ్చించి కట్టిన నిర్మాణం నేలమట్టమైంది. గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందించే ప్రదేశాన్ని.. ఈ విధంగా చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

mother child welfare center demolition
మాతాశిశు సంరక్షణ కేంద్రం కూల్చివేత
author img

By

Published : Nov 6, 2020, 9:22 PM IST

లక్షల రూపాయలు వెచ్చించి గుంటూరు జిల్లా చేబ్రోలులో నిర్మించిన మాతాశిశు కేంద్రాన్ని.. రోడ్లు, భవనాల శాఖ అధికారులు కూల్చివేశారు. ప్రధాన రహదారి వెంట అక్రమ నిర్మాణాల తొలగింపులో భాగంగా.. పోలీసులు, రెవెన్యూ, ఆర్​అండ్​బీ అధికారులు కలిసి ఈ చర్యలు తీసుకున్నారు.

సుమారు ఐదు లక్షలు వెచ్చించి కట్టిన కేంద్రాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. ప్రతినెలా గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందజేసేందుకు ఆవాసం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

'కిడ్నాప్' కలకలం: బాధితుడి వాదన ఒకటి.. పోలీసుల వాదన మరోటి!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.