గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బెల్లంకొండ రాజ్యలక్ష్మి అనే మహిళకు 13 సంవత్సరాల క్రితం నరేంద్ర కుమార్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఇద్దరు కొడుకులు పుట్టిన తరువాత నాలుగేళ్ళ క్రితం భర్త మరణించాడు. తర్వాత భార్య రాజ్యలక్ష్మీ షేక్ రహీం, ప్రమోద్ అనే ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అదే క్రమంలో తన ఇద్దరు పిల్లలను హీనంగా చూస్తూ అనేక ఇబ్బందులకు గురి చేసింది. ఒకానొక దశలో గ్యాస్ లీకేజీ ద్వారా కుమారులను హతమార్చేందుకు యత్నించింది. ఇదంతా గమనించిన పిల్లలు తల్లి నుంచి తప్పించుకుని అమ్మమ్మ ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తెలిపారు.
స్పందనలో ఫిర్యాదు
రాజ్యలక్ష్మి, రహీం, ప్రమోద్‌లు కలసి ఉన్న ఆస్తులను విడతల వారీగా అమ్ముకుంటూ... జల్సా చేస్తుండటం గమనించిన అమ్మమ్మ, తాతయ్యలు పిల్లలను తీసుకుని గుంటూరు రూరల్ ఎస్పీ కార్యాలయానికి చేరుకుని స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వీరారెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి: