గుంటూరు జిల్లా మాచర్ల మండలం కంభంపాడులో విషాదం నెలకొంది. కొడుకు చేయి కోసుకున్నాడని మనస్తాపంతో ఓ తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన నాగుర్‌బీ అనే మహిళ... కుమారుడు పబ్‌జీ ఆడుతుంటే వద్దని మందలించింది. తల్లి తిట్టిందనే కోపంతో అతను చేయి కోసుకున్నాడు. ఆమె మనస్తాపంతో పొలానికి వెళ్లి పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.
ఇదీ చూడండి. వైకాపాలో రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చారు: కళా వెంకట్రావు