ETV Bharat / state

అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారి అరెస్టు - గుంటూరులో వడ్డీ వ్యాపారి అరెస్ట్

పేదలు, చిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొని... ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారిని లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.30.32 లక్షల నగదు, 9 ఖాళీ ప్రామీసరీ నోట్లు, 10 ఖాళీ చెక్కులు, వడ్డీ లెక్కల పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు తూర్పు డీఎస్పీ సుప్రజ వివరించారు. లాలాపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వెల్లడించారు.

money launderer arrest at guntur district
గుంటూరులో వడ్డీ వ్యాపారి అరెస్ట్
author img

By

Published : Jan 1, 2020, 7:36 PM IST

అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారి అరెస్టు

హజారివారివీధిలో కళ్యాణచక్రవర్తి అనే వ్యక్తి కొన్నేళ్లుగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. అవసరం నిమిత్తం వచ్చిన వారి నుంచి ఎక్కువ వడ్డీ వసూలు చేశాడు. అతని అనుచరుడు శేఖర్​తో బెదిరింపులకు పాల్పడ్డాడు. గుంటూరులోని నెహ్రూనగర్​కు చెందిన దుర్గా ప్రసాద్ ఈ వ్యాపారి వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వడ్డీ వ్యాపారి కళ్యాణ చక్రవర్తి, అతని అనుచరుడు శేఖర్​ను అరెస్టు చేశాం. భయపడకుండా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
-సుప్రజ, డీఎస్పీ, గుంటూరు తూర్పు

ఇదీ చదవండి: బార్ల యజమానులకు హైకోర్ట్​లో చుక్కెదురు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.