ETV Bharat / state

అంత్యక్రియలకు ఫీజులు.. వెల్లువెత్తుతున్న విమర్శలు - guntur latest news

కరోనా ఆపద కాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన అధికారులు నూతన విధానానికి తెరతీశారు. గుంటూరు నగరపాలకసంస్థ ఆధ్వర్యంలోని శ్మశానవాటికల్లో అంత్యక్రియలకు ఫీజులు నిర్దేశిస్తూ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ చర్య.. వివాదాస్పదమవుతోంది.

money gathering for cremation in old guntur
అంత్యక్రియలకు ఫీజుల నిర్ధరణపై విమర్శలు
author img

By

Published : May 9, 2021, 7:27 PM IST

పాత గుంటూరు హిందూ శ్మశానవాటికలో సాధారణ మృతదేహం దహనానికి రూ.2,200... కొవిడ్ మృతదేహం దహనానికి రూ.5,100 అంటూ నగరపాలకసంస్థ బోర్డులు పెట్టడం వివాదాస్పదమైంది. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో అంత్యక్రియల కోసం ఇంత మొత్తంలో డబ్బు వసూలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. స్పందించిన అధికారులు బోర్డును తీసేశారు. పేద ప్రజలకు ఉచితంగానే అంత్యక్రియలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 22,164 కరోనా కేసులు, 92 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.