ETV Bharat / state

'ఆ అవకాశం లేదంటే  విద్యార్థుల హక్కులు కాలరాయడమే' - ఎమ్మెల్సీ రామకృష్ణ వార్తలు

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడాన్ని మెజార్టీ ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారని ఎమ్మెల్సీ రామకృష్ణ అన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయం తెలుసుకోకుండా ప్రభుత్వం ఈ విషయంలో మొండి వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. విద్యార్థులకు మీడియం ఎంచుకునే అవకాశం లేకపోవడం వారి హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు.

'ఆంగ్లమాధ్యమంపై ప్రభుత్వ వైఖరి విద్యార్థుల హక్కులను కాలరాయడమే..!'
'ఆంగ్లమాధ్యమంపై ప్రభుత్వ వైఖరి విద్యార్థుల హక్కులను కాలరాయడమే..!'
author img

By

Published : Dec 20, 2019, 1:02 PM IST

ఆంగ్లమాధ్యమంపై ప్రభుత్వం వైఖరిని తప్పుబట్టిన ఎమ్మెల్సీ రామకృష్ణ

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై సవరణ కోరామని ఎమ్మెల్సీ రామకృష్ణ అన్నారు. తనతో పాటు మరో ఎమ్మెల్సీ అశోక్​ బాబు సైతం సవరణ కోరారరన్నారు. 70 శాతం మంది విద్యార్థులు ఆంగ్లమాధ్యమం, 30 శాతం మంది విద్యార్థులు తెలుగు మీడియం ఎంచుకున్నారని సీఎం జగన్ చెప్పారని... ఇప్పుడు ఆ 30 శాతం మందిని ఏం చేద్దామనుకుంటున్నారని రామకృష్ణ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల సాధినేని చౌదరయ్య కళాశాలలో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆంగ్ల మాధ్యమ బిల్లును వ్యతిరేకించామన్నారు. రాష్ట్రంలో 1.86 లక్షల మంది ఉపాధ్యాయుల్లో మెజార్టీ దీనిని మంచి పద్ధతి కాదంటున్నారని తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులకు మీడియం ఎంచుకునే అవకాశం లేకపోవడం వారి హక్కులను కాలరాయడమేనని అన్నారు. పిల్లలకి ఇంగ్లిష్​తో పాటు మాతృ భాష కూడా అవసరమని ఇదే సరైన విధానమని రామకృష్ణ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

మధ్యాహ్న భోజన పథకం .. ఇలా చేస్తే ఉభయతారకం

Intro:రాష్ట్రంలో ఆంగ్ల బోధన తో పాటు తెలుగు మీడియంలో కూడా బోధన తప్పనిసరిగా ఉండాలని ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు

Body:రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 70 శాతం మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం 30 శాతం మంది విద్యార్థులు తెలుగు మీడియం ఎంచుకున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు... ఇప్పుడు ఆ 30 శాతం మందిని ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటూ ఎమ్మెల్సీ రామకృష్ణ ప్రశ్నిస్తున్నారు... గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల సాధినేని చౌదరయ్య కళాశాలలో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలోనే బోధించాలని శాసనసభ, శాసనమండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు.. శాసనమండలిలో తనతో పాటు మరో ఎమ్మెల్సీ అశోక్ బాబు అమెండ్మెంట్ కు సంబంధించి సవరణ కోరడం జరిగిందన్నారు.. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించామని అన్నారు.. రాష్ట్రంలో 1.86 లక్షల మంది ఉపాధ్యాయులలో మెజార్టీ ఉపాధ్యాయులు ఇది సరైన పద్ధతి కాదు అంటున్న పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు... తల్లిదండ్రులకు వారి పిల్లలకు మీడియం ఎంచుకునే అవకాశం లేకపోవడం వారి హక్కులను కాలరాయడమే అని అన్నారు..
సరిహద్దు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, కర్నూలు ,చిత్తూరు ప్రాంతాలలో ఒడియా తమిళం ఇతర భాషల చదివే వారు 19 వేల మంది ఉన్నారన్నారు అలానే ఉర్దూ చదివేవారు 14 వేల మంది ఉన్నారన్నారు.. ఇది మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు.. ఈ విధానంతో వారి భవిష్యత్తు ఏమి కావాలనుకుంటున్నారు 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటవ తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు మాతృభాషలోనే విద్య అందించాలని చెబుతోందన్నారు.. ఈ బిల్లుకు న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్నాయన్నారు ..దీనిపై గుంటూరు జిల్లాకు చెందిన గుంటుపల్లి శ్రీనివాసరావు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారన్నారు ...పిల్లలకి ఇంగ్లీష్ తో పాటు మాతృభాష కూడా అవసరమని ఇదే సరైన విధానమని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు...byte1: రామకృష్ణ, ఎమ్మెల్సీ.

Conclusion:మల్లికార్జున రావు ఈటీవీ భారత్ తెలుగు మూవీ పేట గుంటూరు జిల్లా ఫోన్ నెంబర్ 8 0 0 8 8 8 3 2 1 7
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.