వైకాపా ఎమ్మెల్సీగా ఎన్నికైన డొక్కా మాణిక్య వరప్రసాద్ ముఖ్యమంత్రి జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, అంబటి రాంబాబు ఉన్నారు.
ఇవీ చదవండి...