గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తెదేపా జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సాతులూరు గ్రామస్తుడు బండారుపల్లి సత్యనారాయణ.. తనను వైకాపా నేతలు బెదిరిస్తున్నారంటూ ఆందోళన చెందారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ భర్త కుమారస్వామి ఫోన్ చేసి నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరించినట్లు సత్యనారాయణ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ విషయంపై తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట అర్బన్ సీఐ,ఎస్సైని బదిలీ చేస్తే తప్ప ఎన్నికలు సజావుగా జరగవని స్పష్టం చేశారు. పోలీసులు అధికార పార్టీకి వారిద్దరూ కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.
చిలకలూరిపేట తెలుగు విద్యార్థి విభాగం అధ్యక్షుడు గట్టినేని సాయి కారులో అర్బన్ సీఐ సూర్యనారయణ, పట్టణ ఎస్సై షఫీలు 83 మద్యం సీసాలు అక్రమంగా పెట్టారని పుల్లారావు ఆరోపించారు. వాటిని నాదెండ్ల తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి బండారుపల్లి సత్యనారాయణ పంపిస్తున్నట్లు ఇద్దరిపై దుర్మార్గంగా కేసు నమోదు చేశారన్నారు. వారిద్దరి పై ఎన్నికల సంఘంతో పాటు మానవహక్కుల సంఘానికి, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ అభ్యర్థి బండారుపల్లి సత్యనారాయణకు ఫోన్ చేసి నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే విడదల రజినీ భర్త కుమారస్వామి బెదిరించిన ఆడియో రికార్డును విడుదల చేశారు.
ఇవీ చదవండి: