ETV Bharat / state

'సంక్షేమ పథకాలే తమ మద్దతుదారులను గెలిపిస్తాయి'

గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్యే విడదల రజిని.. పంచాయతీ ఎన్నికలపై పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పేదలకు పంపిణీ చేస్తున్న ఇళ్లస్థలాలు.. తమ పార్టీ మద్దతుదారులకు గెలిపిస్తాయని అన్నారు.

vidudhala Rajini
పంచాయతీ ఎన్నిక‌లపై వైకాపా ఎమ్మెల్యే విడదల రజిని సమావేశం
author img

By

Published : Jan 29, 2021, 2:08 PM IST

పంచాయతీ ఎన్నిక‌లు సమీపిస్తున్న తరుణంలో చిలకలూరిపేట వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని.. పంచాయతీలలో నాయ‌కుల‌తో ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌తి ఒక్క‌రూ ఓటు హ‌క్కును వినియోగించుకునేలా పార్టీ కార్య‌క‌ర్త‌లు బాధ్య‌త వహించాలని ఎమ్మెల్యే సూచించారు. అన్ని గ్రామాల్లోనూ వైకాపా మద్దతుదారులే విజ‌య‌కేతనం ఎగుర‌వేయ‌బోతున్నార‌ని ఆశాభావం వ్యక్తం చేశారు.

అమ్మఒడి, రైతు భ‌రోసా, నేత‌న్న నేస్తం, జ‌గ‌న‌న్న తోడు... సంక్షేమ ప‌థ‌కాలు రాష్ట్రంలో అమ‌ల‌వుతున్నాయ‌ని, ప్ర‌తి ఒక్క‌రికీ ఆర్థిక వెసులుబాటు క‌లుగుతోంద‌ని వివ‌రించారు. రాష్ట్రంలో పేద‌లంద‌రికీ ఇల్లు, ఇళ్ల స్థ‌లాల పంపిణీ.. దేశ చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా కొన‌సాగుతోంద‌ని వెల్ల‌డించారు. కొన్నిచోట్ల ప్రతిపక్షనాయకులు రెచ్చ‌గొట్టాల‌ని చూస్తున్నార‌ని, పార్టీ నాయ‌కులు గెలుపే ల‌క్ష్యంగా స‌మ‌న్వ‌యంతో ముందుకుసాగాల‌ని చెప్పారు. సమావేశంలో మండల వైకాపా అధ్యక్షుడు దేవినేని శంకర్​రావు, నేతలు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ.. పల్లె పోరు.. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.