ETV Bharat / state

అభివృద్ధి వికేంద్రీకరణ వైకాపా మేనిఫెస్టోలో ఉంది: ఎమ్మెల్యే శ్రీదేవి

ఎన్నికల సమయంలో చెప్పిన విధంగానే అమరావతి కూడా రాజధానే అని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలంటే, చంద్రబాబుతో సహా తెదేపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.

author img

By

Published : Aug 8, 2020, 5:08 PM IST

mla sridevi
ఎమ్మెల్యే శ్రీదేవి

అభివృద్ధి వికేంద్రీకరణ వైకాపా మేనిఫెస్టోలో ఉందని తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగానే అమరావతి కూడా రాజధానే అని శ్రీదేవి తెలిపారు. అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని చంద్రబాబు భావిస్తే... ఆయనతో సహా తెదేపా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి గెలవాలని సూచించారు. రాష్ట్రంలో ఏదైనా ఘటన జరిగితే.. తెదేపా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేస్తున్నామని ఆమె అన్నారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడైనా ఇలాంటి చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు.

అమరావతిపై వీధి నాటకాలు ఆడుతున్న చంద్రబాబు అండ్ కోను సూటిగా అడుగుతున్నాననీ.. 2014లో చంద్రబాబు గెలిస్తే... అమరావతిలో రాజధాని నిర్మిస్తానని చెప్పారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల్లో గెలిచాక.. అన్ని పార్టీలతో సమావేశం పెట్టి, అందరికీ అనువైన చోట రాజధాని నిర్మించటానికి ప్రయత్నించారా అని నిలదీశారు.

సీఎం జగన్ మాత్రం 2019 ఎన్నికల మేనిఫెస్టోలో అభివృద్ధి వికేంద్రీకరణ అంశాన్ని ఉంచారన్నారు. చంద్రబాబు రాజధాని పేరుతో మోసం చేశారనీ.. రాజధాని ప్రాంతంలో కేవలం ఆయన బినామీలు మాత్రమే లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు.

నేతలు రాజధాని రైతుల్ని మోసం చేయడం ఆపాలని.. లేదంటే ప్రజలు తెదేపా నేతలను తరిమి కొట్టే రోజులు త్వరలోనే ఉంటాయని హెచ్చరించారు. కేసీఆర్ నా జూనియర్ అని చెప్పుకునే చంద్రబాబు.. తెలంగాణా కోసం కేసీఆర్ క‌నీసం నాలుగైదు సార్లు రాజీనామాలు చేసి.. మ‌ళ్లీ గెలిచి తెలంగాణా సాధించారన్నారు. అమరావతి ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదు.. అక్కడ మరో రెండు రాజధానులు ఏర్పాటు చేయకూడదు అని ప్రజలు అనుకుంటున్నారని చంద్రబాబు భావిస్తే.. ఆయన, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని సవాల్ చేశారు.

ఇదీ చదవండి: సీఆర్డీఏపై హైకోర్టు స్టే వెకేట్​ చేయాలని సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.