గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కొండకావూరు గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని గ్రామంలో అర్హులైన 162 మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందాలంటే అనేక ఇబ్బందులు చవిచూడాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. అర్హులై ఉండి స్థలాలు రాని 40 మందికి తరువాత దశలో పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: