నిత్యావసరాల సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామన్న ఆయన.. కూరగాయలు, పండ్లు, పాడి రైతులు నష్టపోకుండా చూస్తున్నామని తెలిపారు. కరోనా వల్ల ఆక్వా రంగం ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటోందన్న ఆయన.. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి ఆగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: వారి కోసం ప్రత్యేకంగా 1000 ఆర్టీసీ బస్సులు