పరిపాలనలో ముఖ్యమంత్రి జగన్ జాతీయ స్థాయిలో 4వ స్థానంలో నిలిచి గుర్తింపు తెచ్చుకున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాక తొలిసారి సొంత నియోజకవర్గమైన గుంటూరు జిల్లా రేపల్లెలో పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రూరల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మాస్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు.
కార్యకర్తల విలువ తెలిసిన వ్యక్తి సీఎం జగన్ అని మోపిదేవి కొనియాడారు. బీసీ వర్గాలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 4 రాజ్యసభ సీట్లలో 2 ఆ వర్గానికి కేటాయించారని చెప్పారు. అవినీతిరహిత పాలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి పాలన చేస్తున్నారన్నారు. ఇవన్నీ ఓర్వలేకే తెదేపా నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపాకు ప్రజాదరణ ఉందని.. రాబోయే రోజుల్లో తెదేపా కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు.
ఇవీ చదవండి...
'స్పందన' పై సచివాలయంలో.. ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్