గుంటూరు, కర్నూలు, నెల్లూరులో తప్ప ఇతర జిల్లాల్లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదవుతున్న నేపథ్యంలో గుంటూరుపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పించామన్న మంత్రి... వీటితో మరింత వేగంగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో 500 పడకల కొవిడ్ ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రుల నిపుణులను బృందాలుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుబాటులో ఉన్న అన్ని వైద్య సేవలను వినియోగించుకుంటామని మోపిదేవి తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు సహకరించాలన్నారు. అందరూ ఇంట్లోనే ఉండాలని, రహదారులపైకి రావద్దని కోరారు. ర్యాపిడ్ కిట్ల విషయంలో ఉపరాష్ట్రపతి స్వయంగా ప్రశంసించారని మంత్రి మోపిదేవి గుర్తు చేశారు.
ఇదీ చదవండి: