ETV Bharat / state

'విశాఖ లాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కావు' - 'విశాఖ లాంటి ఘటనలు భవిష్యత్తులో పునారావృతం కావు'

భవిష్యత్తులో విశాఖ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని... మంత్రి మోపిదేవి స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం స్పందించి 3 గంటల్లోనే అక్కడి సమస్యను కొలిక్కి తీసుకొచ్చారని వివరించారు.

'విశాఖ లాంటి ఘటనలు భవిష్యత్తులో పునారావృతం కావు'

author img

By

Published : May 8, 2020, 11:36 PM IST

విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ వంటి ఘటన భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని... మంత్రి మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. గుంటూరు జిల్లా రేపల్లె ప్రభుత్వ వైద్యశాల వద్ద ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా... రేపల్లె రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దాతల సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఆక్సిజన్ సిస్టంను మంత్రి ప్రారంభించారు.

రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న సేవలను మోపిదేవి కొనియాడారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని...ఆ ఘనత ముఖ్యమంత్రి జగన్​కే దక్కుతుందని కొనియాడారు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం స్పందించి 3 గంటల్లోనే అక్కడి సమస్యను కొలిక్కి తీసుకొచ్చారని పేర్కొన్నారు.

బాధ్యత గల ముఖ్యమంత్రి ఉన్నపుడే ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా... ఎదుర్కొని పరిష్కరించగలుగుతామని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్నవారిని మానవతా దృక్పథంతో ఆదుకోవడానికి ముఖ్యమంత్రి ఎప్పుడు ముందుంటారని మంత్రి ప్రశంసించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.