ETV Bharat / state

Minister Nagarjuna: కారుణ్య నియామకంపై కరుణించమంటే.. మంత్రి గారు కస్సుబుస్సుమంటున్నారు..!

social welfare minister merugu nagarjuna: సమస్యపై మొరపెట్టుకోవడానికి సచివాలయానికి వచ్చిన ఓ బాధిత కుటుంబానికి చీత్కారాలే ఎదురయ్యాయి. కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఆర్పీ రేణుక కాళ్లరిగేలా తిరుతున్నారు. సాంఘిక సంక్షేమశాఖలో పనిచేసే తన సోదరి మృతి చెందటంతో.... కారుణ్య నియామకం కోసం ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య తీరడంలేదు. పరిష్కరించాలని వేడుకోవడానికి అమరావతి సచివాలయానికి వచ్చిన ఆమెకు... మంత్రి మేరుగ నాగార్జున నుంచి అవమానమే ఎదురయ్యింది. కుటుంబంతో సహా మంత్రికి మొరపెట్టుకుంటే బయటకు పొమ్మంటూ మంత్రి కసురుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేణుకను గన్ మెన్లతో బయటకు నెట్టించారని కన్నీరు పెట్టుకున్నారు.

social welfare minister
social welfare minister
author img

By

Published : Jun 8, 2023, 10:28 AM IST

సచివాలయానికి వచ్చిన బాధిత కుటుంబానికి మంత్రి అవమానం

Minister Nagarjuna Insults Visitors: కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించాలంటూ కాళ్లరిగేలా తిరుగుతున్నా 20 ఏళ్లుగా ప్రభుత్వం కనికరించటం లేదు. కలెక్టర్​​కు, సంబంధిత అధికారులకూ చెప్పుకున్నా కనికరించలేదు. పాలనకు గుండెకాయ లాంటి రాష్ట్ర సచివాలయంలో తన గోడు చెప్పుకుందామని వచ్చిన ఆ ఆభాగ్యుల్ని దళితుల సంక్షేమం చూసే ఓ మంత్రి కసురుకున్నారు. మంత్రి అరుపులకు బెదిరిపోయిన ఆ కుటుంబాన్ని తన గన్ మెన్ల చేత బయటకు నెట్టించేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన ఓ బాధిత కుటుంబం ఆవేదన ఇది.

compassionate appointment: కోరుకున్న పోస్టు ఇవ్వడం కుదరదు.. కారుణ్య నియామకాలపై హైకోర్టు

కారుణ్య నియామకం కింద ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే కుటుంబాన్ని పోషించుకోవచ్చని ఆశపడుతున్న ఆ ఆభాగ్యురాలి ఆశ నెరవేరే పరిస్థితి కనిపించటం లేదు. ఓటు వేశాం న్యాయం చేస్తారని అనుకున్న ప్రభుత్వమూ కరుణించటం లేదు. 20 ఏళ్లుగా కారుణ్య నియామకం కోసం ఎదురుచూస్తూ కాళ్లు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కని పరిస్థితి. అయినా ఆశచావక రాజధానిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రులకు చెప్పుకుందామని వస్తే అక్కడ వారికి ఎదురయ్యింది చీత్కారాలే.

కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన అభాగ్యురాలు పేరు ఆర్పీ రేణుక. సాంఘిక సంక్షేమశాఖలో పనిచేసే తన సోదరి 2004లో విధుల్లోనే మృతి చెందటంతో కారుణ్య నియామకానికి దరఖాస్తు చేశారు. దానికి స్థానిక జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కూడా కారణ్య నియామకం కోసం ఆమెకు హామీ ఇస్తూ అధికారిక లేఖ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఆమె అధికారులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. డిపెండెంట్​గా తనకు ఉద్యోగం ఇస్తారేమోనన్న ఆశతో అమరావతి సచివాలయానికి వచ్చిన ఆమెకు మంత్రి మేరుగ నాగార్జున నుంచి చీత్కారాలు ఎదురయ్యాయి. కుటుంబంతో సహా మంత్రికి మొరపెట్టుకుంటే బయటకు పొమ్మంటూ మంత్రి రంకెలేశారని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. గన్ మెన్లతో బయటకు నెట్టించారని కన్నీరు పెట్టుకుంది. బైట్స్

కారుణ్య నియామకం కోసం వస్తే… కీచక పర్వం కొనసాగిస్తున్నాడు..!

'మా సోదరి 2004లో విధుల్లోనే ఉండగా అధికారుల వేదింపులతో ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు మా సోదరి ఉద్యోగం ఇప్పిస్తామని అధికారులు వెల్లడించారు. 20 ఏళ్లుగా కారుణ్య నియామకం కోసం ఎదురుచూస్తూ కాళ్లు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. స్థానిక జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కూడా కారుణ్య నియామకం కోసం ఆమెకు హామీ ఇస్తూ అధికారిక లేఖ ఇచ్చారు. ఇదే అంశంపై న్యాయం చేయమని మంత్రి మేరుగు నాగార్జున గారిని అడిగితే... బయటకు పొమ్మంటూ మంత్రి రంకెలేశారు. ఉద్యోగం అడిగితే...తన గన్ మెన్ల చేత బయటకు నెట్టించేశారు.'- రేణుక,

మంత్రి మేరుగ నాగార్జున తమను బయటకు నెట్టేశారంటూ మీడియాకు చెప్పుకునేందుకు వచ్చిన ఆ కుటుంబాన్ని స్థానిక సచివాలయ భద్రతా సిబ్బందీ బయటకు పంపేశారు. మీడియాతో మాట్లాడొద్దంటూ ఆంక్షలు విధించారు. సరిగ్గా నడవలేని తమ తల్లితో కలిసి వచ్చినవారిని బలవంతంగా బయటకు పంపిచేయటంతో వారంతా కన్నీటితోనే తమ స్వస్థలాలకు వెనుదిరిగిన పరిస్థితి నెలకొంది.

కారుణ్య నియామకం కింద పది మంది అభ్యర్థులు ఎంపిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.