గుంటూరు జీజీహెచ్లో రోగుల సహాయకుల కోసం ఏర్పాటు చేసిన భోజనశాలను అందుబాటులోకి తెస్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ్ రాజు తెలిపారు. జీజీహెచ్లో పర్యటించిన ఆయన.. నిర్మాణంలో ఉన్న భోజనశాల భవనాన్ని పరిశీలించారు. భవన నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. డిసెంబర్ నాటికి పూర్తి చేసి రోగుల సహాయకులకు ఉచితంగా భోజనం అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. జీజీహెచ్ ఉన్నంత కాలం ఉచిత భోజన సదుపాయం అమలలో ఉంటుందని చెప్పారు.
జీజీహెచ్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని అన్నారు. జీజీహెచ్లో మరిన్ని మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తఫా, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్.ప్రభావతి... పాల్గొన్నారు.
ఇదీ చదవండీ...
నీటి సంరక్షణలో దక్షిణాది రాష్ట్రాల్లో కడప జిల్లాకు అగ్రస్థానం