గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం పరిశవారిపాలెంలో సముద్రపు ఒడ్డు వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాసరాజు (43) అనే వ్యక్తి అడవులదీవి గ్రామంలో వాయిదా పద్దతిలో కుర్చీలు, ప్లాస్టిక్ సామాన్ల వ్యాపారం చేస్తుంటాడు. గురువారం రాత్రి సముద్రతీరానికి వెళ్లిన అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
చనిపోయే ముందు ఫోన్ చేసి బతకాలని లేదని చెప్పినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు నకరికల్లు మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అప్పుల బాధతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్సై హరిబాబు తెలిపారు.
ఇదీ చదవండి: