తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా బహదూర్‌పల్లి గ్రామంలో కుత్బుల్లాపూర్, దుండిగల్ మండలాల పరిధిలోని సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు, రేషన్ కార్డు లేని నిరుపేదలకు, వలస కార్మికులకు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఇప్పటివరకు జిల్లాలో రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో సుమారు 15 వేల మందికి సరకులు అందజేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
మేడ్చల్ జిల్లా పాలనాధికారి ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. సెలూన్ షాపుల్లోకి సొంత టవల్‌ను తెచ్చుకోవాలని సూచించారు. మాస్కులు తప్పనిసరిగా అందరూ ధరించాలన్నారు. లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా తప్పదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని కలెక్టర్ సూచించారు.
ఇవీ చూడండి: నగరంలో దుకాణాలు తెరుచుకున్నాయ్.. అతిక్రమిస్తే అంతే ఇక!