MDU SUICIDE ATTEMPT: అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు వేధిస్తున్నారంటూ.. ఎండియు ఆపరేటర్ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తెనాలికి చెందిన కొలకలూరి జాన్‌పాల్.. రేషన్ బియ్యం పంపిణీ వాహన ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఎంపీటీసీ సభ్యులైన కార్తీక్, ఫణికుమార్‌లు …తాను అక్రమ బియ్యం రవాణా చేస్తున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తూ కేసులతో వేధిస్తున్నారని తెలిపాడు.సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు పంపాడు. ఘటనా స్థలానికి చేరుకొన్న స్నేహితులు అపస్మారక స్థితిలో ఉన్న జాన్‌పాల్‌ను వైద్యం కోసం గుంటూరుకు తరలించారు.
ఇవీ చదవండి: