సంపత్‌నగర్‌లో రిజర్వాయర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణానికి కావాల్సిన ప్రభుత్వ స్థలం కోసం ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి వార్డులో పర్యటించారు. సంపత్‌నగర్, పార్వతీపురం, రామచంద్రాపురం, బాబు రాజేంద్రనగర్, కొబ్బరి చెట్టు ఏరియా ప్రజల దాహార్తి తీర్చుటకు ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటుకు పూనుకున్నారు.
15వ ఆర్ధిక సంఘం నిధులతో ట్యాంక్ నిర్మాణానికి అంచనాలు సిద్దం చేశారు. ఈ కొత్త ట్యాంక్ పూరైతే ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య తీరనుందని మేయర్ అన్నారు. టెండర్‌కు సంబంధించిన పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: స్టేట్‌లో ఫస్ట్‌టైం: గుంటూరు జిల్లాలో రెమిడిసివిర్ తయారీ