ETV Bharat / state

ములకలూరు వద్ద భారీగా అక్రమ మద్యం పట్టివేత - Guntur Crime news

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు గ్రామం వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేశారు. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.12 లక్షల 50వేలు ఉంటుందని నరసరావుపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖరరెడ్డి తెలిపారు.

ములకలూరు వద్ద భారీగా అక్రమ మద్యం పట్టివేత

author img

By

Published : Mar 23, 2021, 3:50 PM IST

ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖరరెడ్డి

గుంటూరు జిల్లా ములకలూరు వద్ద భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. బొలేరో వాహనంలో సుమారు రూ.12 లక్షల 50 వేల విలువైన మద్యాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తుండగా.. నరసరావుపేట ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 8246 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన హరికృష్ణ, కుంబా శ్రీనివాసరావు అనే ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు హరిబాబు, సాంబశివరావు పరారయ్యారు. మద్యం తరలిస్తున్న కారు, రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్​రెడ్డి చెప్పారు.

ఇదీ చదవండి:

మంత్రులు బొత్స, పెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.