మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల బీసీ, సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో ఆకస్మిక తనీఖీలు చేపట్టి అక్కడి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో భోజనం చేసి బీసీ హాస్టల్లో బస చేశారు. రెండు హాస్టళ్లలో వార్డెన్లు అందుబాటులో లేకపోవడం, మెనూ సైతం అమలు కాకపోవడంపై ఎమ్మెల్యే వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ఏడాదికాలంగా కాస్మొటిక్ చార్జీలు విడుదల చేయకపోవడం దారుణ మన్నారు. హాస్టల్ సిబ్బందిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసి... సమస్యలపై శాసనసభలో ప్రస్తావించనున్నామని ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి తెలిపారు.
ఇది చూడండి:గుప్త నిధులన్నారు...పోలీసులకు బుక్కయ్యారు!