ETV Bharat / state

'స్వర్ణకారులను ప్రోత్సహించేందుకు స్వర్ణకారభవన్ ఏర్పాటు' - మంగళగిరిలో స్వర్ణకార భవన్

స్వర్ణకారులను ఆదుకునేందుకు... గుంటూరు జిల్లా మంగళగిరిలో స్వర్ణకార భవన్ నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. స్వర్ణకారులతో సమావేశమైన ఆయన ... స్వర్ణకారభవన్ నిర్మాణంపై చర్చించారు. మంగళగిరిలోనే దాదాపు 10 వేల మంది స్వర్ణకారులున్నారన్న ఆయన... లాక్​డౌన్ వారి జీవితాలపై తీవ్రంగా ప్రభావం చూపిందన్నారు.

ఎమ్మెల్యే ఆర్కే
ఎమ్మెల్యే ఆర్కే
author img

By

Published : Jul 23, 2020, 5:10 PM IST

స్వర్ణకార వృత్తిని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు జిల్లా మంగళగిరిలో స్వర్ణకార భవన్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. మంగళగిరి గండాలయపేటలో ఎకరం స్థలంలో... 5 అంతస్తుల స్వర్ణకార భవన్​ను నిర్మించబోతున్నామని వెల్లడించారు. మంగళగిరిలో దాదాపు 10 వేల మంది స్వర్ణకారులున్నారని.. లాక్​డౌన్ వల్ల వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

స్వర్ణకారులను ఆదుకునేందుకు ఓ భవనం నిర్మించాలని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు మంగళగిరిలో ఎకరా స్థలాన్ని సీఎం మంజూరు చేశారు. ఈ భవనంలో ఏయే సదుపాయాలుండాలి? గదులు ఎంత పరిమాణంలో ఉండాలనే అంశాలపై ఎమ్మెల్యే ఆర్కే స్వర్ణకారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చేనెలలో స్వర్ణకార భవన్ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ఆర్కే తెలిపారు.

ఇదీ చదవండి:

స్వాతంత్య్ర దినోత్సవ మార్గదర్శకాలు జారీ.. ప్రత్యేక ఆహ్వానితులు వీరే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.