ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చి నెల దాటినా... ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించ లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి జగన్ ఎంపీగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించారని గుర్తుచేశారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేశారని చెప్పారు. తండ్రిబాటలో పయనిస్తున్నానని పదేపదే ప్రకటించే జగన్... ఈ విషయంపై ఎందుకు తాత్సారం చేస్తున్నారని నిలదీశారు. త్వరలోనే వైకాపాలోని మాదిగ ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి ముఖ్యమంత్రి అనుమతి కోరతానని... అపుడు ఆయన చెప్పే సమాధానంపై భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: