శాంతియుత పాదయాత్రకు అనుమతి నిరాకరించడం సీఎం జగన్ నియంతృత్వ పాలనకు నిదర్శనమని మందకృష్ణ మాదిగ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా జగన్ ఆత్మ విమర్శ చేసుకుని ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి... కేంద్రానికి పంపాలని కోరారు. లేనిపక్షంలో జులై 22 నుంచి 27వ తేదీ వరకు కలెక్టరేట్ల వద్ద నిరవధిక దీక్షలు నిర్వహిస్తామని, 29న అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేస్తామని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోతే... 30 తేదీన అసెంబ్లీ ఎదుట నిరసన చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి.. అక్కడ నెల నీటి ఖర్చు... అక్షరాల రూ.20 వేలు!