రేపల్లె మండలంలో విద్యుదాఘాతం జరిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇసుకపల్లి గ్రామానికి చెందిన ఏ. భాగ్యారావు(47) నీళ్ల మోటారు బాగు చేస్తుండగా..విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి :