మొత్తం డబ్బు చెల్లించాలంటూ అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడాన్ని భరించలేక.. కిరణ్ కుమార్(38) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవర్మరణానికి పాల్పడ్డాడు.
గుంటూరు జిల్లాలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన కిరణ్ కుమార్ (38) ఆరు నెలల క్రితం కుమార్తె మేరీ పెళ్లి చేశాడు. అప్పుగా తీసుకువచ్చిన సొమ్ముకు వడ్డీలు చెల్లించలేకపోయాడు. అప్పు ఇచ్చిన వారు మొత్తం డబ్బు ఇవ్వమని ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ బాధను భరించలేక.. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అరండల్ పేట సీఐ నరేశ్ తెలిపారు.
ఇదీ చదవండి: